పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపణీ చేసిన దిల్ రాజు
- మెహిదీపట్నం రైతు బజారు వద్ద అందజేత
- కరోనా నేపథ్యంలో సేవా కార్యక్రమాల్లో ముందున్న నిర్మాత
- ఇప్పటికే సీఎం సహాయ నిధికి రూ. 10 లక్షలు ఇచ్చిన రాజు
తాజాగా పోలీసు సిబ్బందికి రక్షణ మాస్కులు, శానిటైజర్లు పంపణీ చేశారు. మెహిదీపట్నం రైతు బజారు వద్ద ఈ రోజు ఉదయం పోలీసు డిపార్ట్మెంట్కు దిల్ రాజు వీటిని అందజేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. మనల్ని రక్షించే వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని పేర్కొంది. రెండు రోజుల కింద జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కూడా దిల్ రాజు మాస్కులు, శానిటైజర్లు అందించారు.