'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ జోడీ మారే ఛాన్స్?
- లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్
- లండన్ ఆర్టిస్ట్ ఒలీవియా విషయంలో ఆలోచన
- లాక్ డౌన్ తరువాత ఆలస్యం చేయకూడదనే నిర్ణయంతో రాజమౌళి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఇప్పట్లో ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదు. ఒలీవియా లండన్ ఆర్టిస్ట్ .. అందువలన ఆమెకి ఇక్కడికి వచ్చే అవకాశాలు తక్కువనే అంటున్నారు. అలియా భట్ ముంబై కనుక, ఆమె వలన పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఇప్పటికే షూటింగు ఆలస్యం అయింది కనుక, లాక్ డౌన్ కారణంగా ఒలీవియా లండన్ నుంచి రాలేని పరిస్థితులు వుంటే, ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ఒక టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.