అమితాబ్ నాకు ఫోన్ చేసి అందరినీ అభినందించారు: చిరంజీవి
- సీసీసీ గురించి తెలుసుకొని నాతో మాట్లాడారు
- ఒకే రోజు వెయ్యి మందికి సాయం చేశారని తెలిసి ఆశ్చర్యపోయా
- మన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు
దీన్ని ఒక బాధ్యతగా, ధర్మంగా భావించి కార్మికులకు సాయం చేస్తున్నామని తెలిసి చిత్ర పరిశ్రమలోని వారు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. అలాగే, ఈ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు. సీసీసీ గురించి తెలుసుకొని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనకు ఫోన్ చేసి మాట్లాడారని చిరంజీవి తెలిపారు. దీనికి సాయం చేస్తున్న అందరినీ అభినందించారని చెప్పారు. సీసీసీని ముందుండి నడిపిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్. శంకర్, మెహర్ రమేశ్‌కు చిరు అభినందనలు తెలిపారు.