సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తమన్నా లాక్ డౌన్ సలహాలు
- 'పుష్ప'లో బాలీవుడ్ సెక్సీ భామ
- ఎక్కువ అడుగుతున్న రమ్యకృష్ణ
* అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రంలో బాలీవుడ్ సెక్సీ భామ ఊర్వశి రౌతేలా కూడా నటించనుంది. ఈమెపై ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ నటిస్తున్న 'సీటీమార్' చిత్రంలో నటిస్తోంది.
* హిందీలో వచ్చిన 'అంధాదూన్' చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. అయితే, ఆమె ఈ సినిమా చేయడానికి భారీ మొత్తాన్ని అడుగుతోందట. దాంతో దర్శక నిర్మాతలు ప్రస్తుతం సందిగ్ధంలో పడ్డారని సమాచారం.