సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేసిన వాళ్లకు రాజకీయాలెందుకు?: విజయసాయిరెడ్డి
- చిరు తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవని వ్యాఖ్యలు
- పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందంటూ ఎద్దేవా
- రెండు చోట్ల ఓడిపోతాడని అందరికీ తెలుసంటూ ట్వీట్
"చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. అలాంటి పార్టీతో మేం పొత్తు పెట్టుకుంటామని కలేమైనా కన్నారా? పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల చిత్తుగా ఓడిపోతాడని అందరికీ ముందే తెలుసు" అంటూ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయసాయిరెడ్డిపై నాగబాబు వ్యాఖ్యానిస్తూ.... అప్పట్లో కామన్ ఫ్రెండ్ ద్వారా తన ఇంటికి పొత్తు కోసం వచ్చారంటూ విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలకు ప్రతిగానే విజయసాయిరెడ్డి తాజా ట్వీట్లు చేసినట్టు అర్థమవుతోంది.