ఈ ఆరు నెలలు మన జీవితంలోనే లేవనుకోవాలి: పుల్లెల గోపీచంద్
- ఇది అందరికీ కష్ట కాలమే
- అన్ని రంగాల వారికి నష్టం జరుగుతోంది
- ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచన
‘ఈ సంక్షోభ సమయంలో క్రీడలే కాదు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇలాంటప్పుడే అందుబాటులోని వనరులను వాడుకుంటూ మనల్ని మనం మానసికంగా, శారీరకంగా బలంగా ఉంచుకోవాలి. ఈ ఆరు నెలలు మన జీవితంలో లేవు అని అందరూ అనుకోవాలి. మనకు మంచిది అనిపించిన దారిలో ముందుకెళ్లాలి. పుస్తకాలు చదవడం, లేదంటే మెడిటేషన్ చేస్తూ సానుకూలంగా ఉండాలి . గడచిన వందేళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు కాబట్టి ప్రజలు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కొంతకాలం ఓర్పుగా ఉండాల్సిందే’ అని గోపీచంద్ పేర్కొన్నారు.