టబు అదరగొట్టేసిన పాత్రలో రమ్యకృష్ణ?
- హిందీలో హిట్ కొట్టిన 'అంధదూన్'
- టబు పాత్రకి గాను వినిపించిన అనసూయ పేరు
- తాజాగా తెరపైకి రమ్యకృష్ణ
ఆ పాత్రకి అనసూయ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో చర్చలు జరుపుతున్నటుగా ప్రచారం జరిగింది. తాజాగా రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. కథలో అత్యంత కీలకమైన పాత్ర అదే కావడంతో, ఆ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందని భావించి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే హిందీలో టబు చేసిన పాత్ర కాస్త బోల్డ్ గా .. నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది. ఆ పాత్ర చేయడానికి రమ్యకృష్ణ ఒప్పుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.