మా వంతు సాయం చేస్తున్నాం.. మీరూ చేయండి: దీపిక, రణ్వీర్
- కరోనాపై పోరులో ముందుకొచ్చిన బాలీవుడ్ జంట
- పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ఇస్తున్నట్టు ప్రకటన
- ఎంత ఇచ్చారో వెల్లడించని దంపతులు
‘ఇలాంటి సమయంలో ప్రతి చిన్న సహాయం కూడా ఉపయోగపడుతుంది. పీఎం కేర్స్ ఫండ్‌కు మా వంతు సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనమంతా ఐకమత్యంగా ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటపడతాం. జైహింద్’ అని దీపిక ట్వీట్ చేసింది. అయితే తాము ఎంత విరాళం ఇస్తున్నామనే విషయాన్ని ఈ జంట వెల్లడించలేదు.