నేనింతే .. ఇష్టమైతేనే చేస్తాను: కంగనా రనౌత్
- హీరో ఎవరైనా పట్టించుకోను
- పాత్ర బాగుంటేనే చేస్తాను
- తన నిర్ణయం మారదన్న
సల్మాన్ సరసన 'సుల్తాన్'లో చేసే అవకాశం వచ్చింది. అనుష్క శర్మ చేసిన పాత్ర కోసం ముందుగా నన్నే అడిగారు. కొన్ని కారణాల వలన చేయనని చెప్పాను. అందుకు ఆ నిర్మాతకి కోపం వచ్చినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇక రణబీర్ కపూర్ జోడీగా 'సంజూ' చేసే ఛాన్స్ కూడా ముందుగా నాకే వచ్చింది. ఆ పాత్ర నా స్థాయికి తగినది కాదనే చేయలేదు. రణ బీర్ స్వయంగా కాల్ చేసినా నో అనేశాను" అంటూ చెప్పుకొచ్చింది.