ప్రిన్స్ హ్యారీపై నాకు చాలా గౌరవం ఉంది.. అయితే, వారి భద్రత ఖర్చులను వారే భరించాలి: ట్రంప్
- హ్యారీ దంపతులు కెనడాలో ఉంటారని తొలుత విన్నాం
- ఇప్పుడు అమెరికాకు వచ్చారు
- వారు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు
రాచకుటుంబాన్ని వీడిన హ్యారీ, మేఘన్ దంపతులు కెనడాలో నివసిస్తారని తొలుత విన్నామని... ఇప్పుడు వారు కెనడాను వీడి అమెరికాకు వచ్చారని తెలిపారు. అమెరికాలో వారు సంతోషంగా ఉండొచ్చని, అయితే వారి భద్రత ఖర్చులను అమెరికా భరించదని, ఆ ఖర్చులను వారే చెల్లించాలని స్ఫష్టం చేశారు.