రవితేజ జోరుకి తగిన కథ!
- నక్కిన త్రినాథరావుతో రవితేజ
- 1980 నాటి నేపథ్యం
- కామెడీ ఎంటర్టైనర్ గా సాగే కథ
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రవితేజ ఈ సారి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ను ఎంచుకున్నట్టు సమాచారం. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రవితేజ అంగీకరించిన విషయం తెలిసిందే. రవితేజ బాడీ లాంగ్వేజ్ ను .. జోష్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ కథను సిద్ధం చేశాడని అంటున్నారు. 'నేను లోకల్' .. 'సినిమా చూపిస్త మావ' సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా సాగుతుందని చెబుతున్నారు.