కృష్ణవంశీతో నాకు ఎలాంటి గొడవలు లేవు: నటుడు ఉత్తేజ్
- రైటర్ గా వర్మ దగ్గర పనిచేశాను
- కృష్ణవంశీతో మంచి స్నేహం వుంది
- అవకాశాలతో సంబంధం లేని అనుబంధం ఉందన్న ఉత్తేజ్
నిజానికి మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. తన పేరులో సగం ఉత్తేజ్ అని ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చెప్పడం నేను చూశాను. ఆయనతో కలిసి కనిపిస్తే స్నేహంగా ఉన్నట్టు .. లేదంటే విడిపోయినట్టు కాదు. కృష్ణవంశీ నాకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటే, ప్రస్తుతం ఆయనకే సినిమాలు లేవు. అలా అని సినిమాల్లో అవకాశం ఇస్తేనే ఆయనతో స్నేహంగా వుంటాను .. లేకపోతే లేదు అనుకునే టైపు కూడా నేను కాదు. ఇప్పటికీ ఆయన నాకు మెసేజ్ లు పెడుతూనే ఉంటాడు" అని చెప్పుకొచ్చాడు.