గోపీచంద్ ను కొత్తగా చూపించనున్న తేజ
'జయం' సినిమాతో ప్రతినాయకుడిగా గోపీచంద్ ను తెలుగు తెరకి పరిచయం చేసిందే తేజ. 'నిజం' సినిమాతో గోపీచంద్ లోని ప్రతినాయకుడిని పూర్తిస్థాయిలో ఆయన ఆవిష్కరించాడు. అలాంటి గోపీచంద్ హీరోగా ఎదిగాక ఆయనతో కలిసి తేజ చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగానే కనిపించనున్నాడు. విలన్ గా గోపీచంద్ ను ఒక రేంజ్ లో చూపించిన తేజ, హీరోగా ఆయనను పవర్ఫుల్ పాత్రలో .. డిఫరెంట్ లుక్ తో చూపించనున్నట్టు చెబుతున్నారు.