ఈవీవీ కథతో రంగంలోకి 'అల్లరి' నరేశ్
గతంలో ఈవీవీ సిద్ధం చేసిన ఒక కథను ఆయన సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఈవీవీ కథల కారణంగానే అప్పట్లో 'అల్లరి' నరేశ్ వరుస విజయాలను అందుకున్నాడు. అందువల్లనే గతంలో ఈవీవీ రాసుకున్న కథల్లోని ఒక కథను ఎంచుకుని 'అల్లరి' నరేశ్ రంగంలోకి దిగుతున్నాడని అంటున్నారు. తనకి సన్నిహితుడైన ఒక దర్శకుడితో ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.