'కొండవీటి దొంగ' విషయంలో శ్రీదేవి ఆ షరతులు పెట్టారు: పరుచూరి గోపాలకృష్ణ
చిరంజీవిగారికి కూడా కథ నచ్చేసింది .. హీరోయిన్ గా శ్రీదేవిని అనుకుంటున్నట్టుగా చెప్పి, ఆమెను కలిశాను. శ్రీదేవి ఇంటికి వెళ్లి నేనే కథ చెప్పాను. అంతా విన్న తరువాత ఈ సినిమా టైటిల్ ను 'కొండవీటి రాణి - కొండవీటి దొంగ' గా మార్చాలనే షరతు పెట్టారు. అలాగే లవ్ చేయమని హీరో వెంట హీరోయిన్ పడటాన్ని, హీరోనే హీరోయిన్ వెనక పడేలా మార్చమని అన్నారు. ఆ విషయం త్రివిక్రమరావుగారికి చెబితే, అలా కుదరదని చెప్పేశారు. ఆ తరువాత ఆ కథను ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా మార్చుకుని, రాధ - విజయశాంతిలతో చేశామని చెప్పుకొచ్చారు.