అప్పటి నుంచి డబ్బింగ్ చెప్పమని ఎవరూ అడగలేదు: యాంకర్ ప్రదీప్
- నా వాయిస్ బాగుందన్నారు
- డబ్బింగ్ చెప్పమని అడిగారు
- నాకు రాదని చెప్పినా వినిపించుకోలేదన్న ప్రదీప్
'మీరు భలే వారే .. మీ వాయిస్ అంటే అందరికీ చాలా ఇష్టం .. మీరు చెప్పాల్సిందే' అన్నారు. 'సరే కానివ్వండి .. మీ ఇష్టం' అన్నాను. నన్ను వాళ్లు డబ్బింగ్ థియేటర్ కి తీసుకెళ్లారు. నేను డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన ఐదు నిమిషాలకే వాళ్లు పరుగున లోపలికి వచ్చారు.
'టీ .. కాఫీ ఏమైనా తాగుతారా సార్ .. నైస్ మీటింగ్ యు' అన్నారు. 'ఓకే సార్ .. థ్యాంక్యూ' అని చెప్పేసి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరూ డబ్బింగ్ కి పిలవలేదు .. నేను వెళ్లలేదు' అంటూ నవ్వేశాడు ప్రదీప్.