ఉగాదికి ప్రభాస్ ఫస్టులుక్
- రాధాకృష్ణ దర్శకుడిగా రొమాంటిక్ ఎంటర్టైనర్
- ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే
- తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల
ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ తో పాటు, 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఏ టైటిల్ అనేది ఇంకా ఖరారు చేయలేదు. కొన్ని రోజుల్లో టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఉగాది రోజున రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. సో.. ఈ ఉగాది ప్రభాస్ అభిమానులకు మంచి గిఫ్ట్ నే ఇవ్వనుందన్న మాట. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.