నాటి మధురక్షణాలు ‘83’ సినిమాలో పునఃసృష్టి!
- కపిల్ దేవ్ జీవిత కథతో ‘83’ సినిమా
- కపిల్ పాత్రలో నటిస్తున్న రణ్ వీర్ సింగ్
- కప్ అందుకున్న సన్నివేశాల ఫొటోల విడుదల
కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. 1983 లో కపిల్ దేవ్ ప్రపంచకప్ అందుకున్న అపురూప ఘట్టాన్ని పున:సృష్టించారు. కపిల్ పాత్రలో రణ్ వీర్ వరల్డ్ కప్ అందుకున్న ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అచ్చం 1983లో కపిల్ కప్పు అందుకున్నట్టుగానే ఉన్న ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. క్రికెట్, బాలీవుడ్ ఫ్యాన్స్ రణ్ వీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు.