రంగంలోకి దిగుతున్న రెజీనా, నివేదా
- సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి మరో రీమేక్
- దర్శకుడిగా సుధీర్ వర్మ
- వచ్చేనెల మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు
ఈ సినిమాలో ప్రధాన పాత్రలకిగాను రెజీనాను .. నివేదాను తీసుకున్నారు. కొరియన్ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వాళ్ల దగ్గరే రెజీనా - నివేదా శిక్షణ తీసుకున్నారు. ఈ నెల మూడవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెజీనా .. నివేదాలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఈ ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.