'భీష్మ' పది రోజుల వసూళ్లు
- తొలి ఆటతోనే సక్సెస్ టాక్
- నైజామ్ లో పది రోజుల వసూళ్లు 8.57 కోట్లు
- మరింత పెరగనున్న వసూళ్లు
ఈ 10 రోజుల్లో ఒక్క నైజాం లోనే ఈ సినిమా 8.57 కోట్లను రాబట్టడం విశేషం. ఎక్కడా బోర్ కొట్టని వినోదం .. ఆసక్తికరమైన మలుపులు .. ఆకట్టుకునే సంగీతం ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'ఉగాది' వరకూ 'భీష్మ'కి పోటీ ఇచ్చే సినిమాలేవీ బరిలో లేవు. అందువలన ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.