దసరా సీజన్లో రానున్న ప్రభాస్ మూవీ
- షూటింగు దశలో ప్రభాస్ మూవీ
- ప్రత్యేక ఆకర్షణ కానున్న భారీ సెట్స్
- అక్టోబర్ 16వ తేదీన రిలీజ్ చేసే ఆలోచన
పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతోంది. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ హంగులతో రూపొందుతున్న కారణంగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపించింది. కానీ ఈ సినిమాను దసరా సీజన్లో విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 16ను విడుదల తేదీగా లాక్ చేశారట. రెగ్యులర్ బయ్యర్లకు కూడా ఈ సమాచారం వెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ తేదీని ప్రకటించనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.