మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ
- 'క్రాక్' సినిమాతో బిజీగా రవితేజ
- కొత్త కథతో మెప్పించిన నక్కిన
- లైన్లో 'రాక్షసుడు' దర్శకుడు
ఈ సినిమాతో పాటు రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ దర్శకుడు పేరే నక్కిన త్రినాథరావు. 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' .. 'హలో గురు ప్రేమకోసమే' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్లు ఆయన నుంచి వచ్చినవే. ఆయన ట్రాక్ రికార్డ్ చూసే రవితేజ ఓకే అనేశాడట. ఈ సినిమాకి విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. రమేశ్ వర్మ ప్రాజెక్టు కంటే ముందే త్రినాథరావు ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.