తేజ నుంచి రెండు సినిమాలు .. హీరోలుగా రానా, గోపీచంద్
- ఈ రోజున తేజ పుట్టిన రోజు
- రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించిన తేజ
- హీరోలుగా రానా - గోపీచంద్
ఆ తరువాత ఆయన రెండు కథలపై కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ, వాటిపై స్పష్టత రాలేదు. ఈ రోజున తేజ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాలకి సంబంధించి రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాడు. ఒక టైటిల్ 'అలిమేలుమంగ - వెంకటరమణ' అయితే, మరో టైటిల్ 'రాక్షస రాజు రావణాసురుడు' ఈ రెండింటిలో ఒక సినిమాలో రానా .. మరో సినిమాలో గోపీచంద్ నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మిగతా వివరాలను ఆయన త్వరలో తెలియజేయనున్నాడు.