'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 'డెవిల్'?
- తెలుగులో హిట్ కొట్టిన 'అర్జున్ రెడ్డి'
- 'కబీర్ సింగ్' టైటిల్ తో హిందీలోను విజయవంతం
- ఆసక్తిని చూపని రణ్ బీర్ కపూర్
ఆ తరువాత అక్కడే ఆయన రణ్ బీర్ కపూర్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి 'డెవిల్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన రణ్ బీర్ కపూర్ ఈ ప్రాజెక్టు పట్ల అంతగా ఆసక్తిని చూపలేదట. దాంతో సందీప్ రెడ్డి ఈ కథను ప్రభాస్ కి వినిపించగా, వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి వుంది. ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమా షూటింగులో బిజీగా వున్నాడు.