నైజామ్ లో 'వరల్డ్ ఫేమస్ లవర్' తొలిరోజు వసూళ్లు
- నిన్ననే విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్
- అమెరికాలో కనిపించని జోరు
తొలి రోజున నైజామ్ లో 2.02కోట్లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండకి మొదటి నుంచి నైజామ్ లో ఫాలోయింగ్ ఎక్కువ. అందువల్లనే ఈ సినిమా ఇక్కడ తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఇక అమెరికాలో మాత్రం ఈ సినిమా వసూళ్లు అంత ఆశాజనకంగా లేవట. పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం, సినిమా టీజర్ .. ట్రైలర్ లలో 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనిపించడం వల్లనే అక్కడి ప్రేక్షకులు అంతగా ఆసక్తిని చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.