మీ బ్రతుకు ఇంతేనా..? ఇదేనా మీ నైజం..?: వైసీపీ నేతలపై పంచుమర్తి ఫైర్
- చంద్రబాబుపై వైసీపీ నేతల విమర్శల దాడి
- ఘాటుగా స్పందించిన పంచుమర్తి అనురాధ
- వైఎస్సార్ 26 ఎంక్వైరీలు వేసినా ఏమీ చేయలేకపోయారని వ్యాఖ్యలు
"మీరా మా గురించి మాట్లాడేది? మంచి కుక్కపై పిచ్చికుక్క అని ముద్రవేస్తే అందరూ దాన్ని చంపేస్తారన్నది తెలిసిన విషయమే. వైసీపీ ఈ విధమైన రాజకీయాలు చెయ్యాలనుకుంటోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి 26 ఎంక్వైరీలు వేసినా చంద్రబాబును ఏమీ చేయలేకపోయారు. విజయమ్మ 2600 పేజీలతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆధారాల్లేకుండా వచ్చి సమయం వృథా చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆమెను మందలించింది. ఈ విషయం వైసీపీ నేతలకు గుర్తులేదా?" అంటూ మండిపడ్డారు.