విష్వక్సేన్ హీరోగా 'హిట్' .. ప్రోమో రిలీజ్
- నాని నిర్మాతగా 'హిట్' మూవీ
- మిస్సింగ్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 28వ తేదీన విడుదల
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ గా 'హిట్' ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో 'హిట్' టీమ్ కి సంబంధించిన ఆఫీసర్ గా విష్వక్సేన్ కనిపిస్తున్నాడు. ప్రీతీ అనే ఒక అమ్మాయి మిస్సింగ్ మిస్టరీ చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ను ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్నారు.