అడగ్గానే టైటిల్ ఇచ్చినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్: దిల్ రాజు
- చిత్ర నిర్మాణంలో దిల్ రాజు బిజీ
- త్వరలో విడుదల కానున్న జాను
- ప్రభాస్ కొత్త చిత్రం జాన్!
- దగ్గరగా ఉన్న రెండు టైటిళ్లు
ఈ నేపథ్యంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. తమిళంలో వచ్చిన '96' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించిన 'జాను' చిత్రం టైటిల్ గురించి చెప్పారు. '96' రీమేక్ కు టైటిల్ గురించి ఆలోచించగానే 'జాను' అనే పేరు అయితే బాగుంటుందనిపించిందని తెలిపారు.
కానీ ప్రభాస్ నటిస్తున్న సినిమాకు 'జాన్' అనే టైటిల్ పెడుతున్నట్టు తెలియడంతో యూవీ క్రియేషన్స్ వాళ్లను సంప్రదించానని చెప్పారు. కొన్నిరోజుల అనంతరం యూవీ క్రియేషన్స్ నుంచి ఫోన్ వచ్చిందని, 'జాను' టైటిల్ పెట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. తమ చిత్రం వచ్చేందుకు చాలా సమయం ఉందని, ఇప్పటికప్పుడు టైటిల్ తో వచ్చిన ఇబ్బందేమీ లేదని వారు భరోసా ఇచ్చారని దిల్ రాజు తెలిపారు. అడగ్గానే టైటిల్ ఇచ్చినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని తెలిపారు.