'లోకల్ బాయ్'గా వస్తున్న ధనుశ్
- తమిళనాట హిట్ కొట్టిన 'పట్టాస్'
- తెలుగు టైటిల్ గా 'లోకల్ బాయ్'
- వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు
దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'లోకల్ బాయ్' టైటిల్ తో నిర్మాత సతీశ్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను ఇక్కడ విడుదల చేయనున్నారు. ధనుశ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని మరీ ధనుశ్ చేసిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నవీన్ చంద్ర మెప్పించాడు.