బ్రహ్మానందం భావోద్వేగాలు కన్నీళ్లు పెట్టిస్తాయట!
- ప్రధాన పాత్రలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ
- కీలకమైన పాత్రలో బ్రహ్మానందం
- సంగీత దర్శకుడిగా ఇళయరాజా
బ్రహ్మానందం భావోద్వేగాలు ఆవిష్కరించిన సినిమాల్లో 'బాబాయ్ హోటల్' ఒకటిగా కనిపిస్తుంది. ఆ సినిమాలో ఆయన నవ్వించడమే కాదు .. ఏడిపిస్తాడు కూడా. అదే తరహాలో 'రంగమార్తాండ' సినిమాలోను ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని అంటున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చగా, ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ కనిపించనున్నారు.