నా వలన భానుచందర్ ఇబ్బంది పడకూడదనుకున్నాను: సీనియర్ హీరో సుమన్
- నేను జైలుకెళతానని నాకు ముందే తెలుసు
- జాతకాలపై మొదటి నుంచి నమ్మకం వుంది
- తనని ఎవరూ కావాలని ఇరికించలేదన్న సుమన్
భానుచందర్ నాకు మంచి మిత్రుడు. నేను తెలుగు చిత్రపరిశ్రమకి రావడానికి ఆయనే కారకుడు. నా వలన అతను ఇబ్బందుల్లో పడకూడదని భావించి, కొంతకాలం వరకూ నన్ను కలవడానికి .. ఫోన్ చేయడానికి ప్రయత్నించవద్దని ఆయనకి ముందుగానే చెప్పాను. దివాకర్ అనే ఒక వ్యక్తి చేసిన పనికి నేను జైలుకి వెళ్లవలసి వచ్చింది. ఆ వ్యక్తికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు. అలాగే నన్ను ఈ కేసులో ఇరికించడం వెనుక ఒక పెద్ద హీరో ఉన్నాడనే దాంట్లోను నిజం లేదు" అని చెప్పుకొచ్చారు.