'జాను' నుంచి ఫస్టు సాంగ్ వచ్చేస్తోంది
- తమిళ '96' మూవీకి రీమేక్
- నమ్మకంతో వున్న 'దిల్' రాజు
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
తమిళంలో హిట్ కొట్టిన '96' మూవీకి ఇది రీమేక్. విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషిస్తుండగా, త్రిష పాత్రలో సమంత కనిపించనుంది. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వైవిధ్యభరితమైన ఈ సినిమాపట్ల నిర్మాతగా 'దిల్' రాజు ఎంతో నమ్మకంతో వున్నాడు. ఇక శర్వానంద్ - సమంత ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.