'వరల్డ్ ఫేమస్ లవర్' మొదటి పాట రిలీజ్... స్పందించిన విజయ్ దేవరకొండ
- 'మనసును మీటే' అంటూ సాగే హృద్యమైన గీతం
- గోపీసుందర్ బాణీలు, రహ్మాన్ సాహిత్యం
- ఈ పాట ఓ అందమైన భావన అని పేర్కొన్న విజయ్ దేవరకొండ
'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలోని తొలిపాట ఓ అందమైన భావన అని పేర్కొన్నారు. ఈ పాట తనను అన్ని మధుర క్షణాల గురించి ఆలోచించేలా చేసిందని వివరించారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఇజబెల్లా లీట్ నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.