నైజామ్ లో కొత్త రికార్డును నమోదు చేసిన బన్నీ
- ఈ నెల 12న వచ్చిన 'అల వైకుంఠపురములో'
- తొలివారంలో 180 కోట్ల గ్రాస్
- నైజామ్ లో 30 కోట్లకి పైగా వసూళ్లు
ఈ నెల 12వ తేదీన విడుదలైన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయ విహారం చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో ఈ సినిమా 180 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక నైజామ్ లో 8 రోజుల్లో ఈ సినిమా 31.86 కోట్లను సాధించింది. అల్లు అర్జున్ కెరియర్లో అత్యంత వేగంగా 30 కోట్లను రాబట్టిన చిత్రంగా 'అల వైకుంఠపురములో' ఒక కొత్త రికార్డును ఇచ్చింది. త్రివిక్రమ్ కథనం .. అల్లు అర్జున్ నటన ప్లస్ డాన్స్ .. పూజా హెగ్డే గ్లామర్ .. తమన్ బాణీలు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో కీలకమైన పాత్రలను పోషించాయని అంటున్నారు.