6 రోజుల్లోనే 104 కోట్ల షేర్ రాబట్టిన 'అల వైకుంఠపురములో'
- భారీ ఓపెనింగ్స్ తో మొదలైన బన్నీ మూవీ
- తెలుగు రాష్ట్రాల్లో 82 కోట్ల షేర్
- కర్ణాటకలోను బన్నీ దూకుడు
తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లోనే ఈ సినిమా 82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. కర్ణాటకలో ఈ సినిమా ఈ 6 రోజుల్లో 8.5 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 104 కోట్ల షేర్ ను సాధించింది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డును సృష్టించిందంటూ అధికారికంగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ ఏడాది ఆరంభంలోనే బన్నీకి భారీ సక్సెస్ లభించినందుకు ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.