బన్నీ మూవీలోను అనసూయకి ఛాన్స్ ఇచ్చిన సుకుమార్
- 'రంగమ్మత్త' పాత్రకి న్యాయం చేసిన అనసూయ
- అదే తరహా పాత్రను ఇచ్చిన సుకుమార్
- త్వరలో బన్నీతోపాటు సెట్స్ పైకి అనసూయ
తదుపరి షెడ్యూల్లో అల్లు అర్జున్ జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అనసూయ కూడా జాయిన్ కానుందని అంటున్నారు. 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా సుకుమార్ ఇచ్చిన పాత్రకి అనసూయ పూర్తి న్యాయం చేసింది. దాంతో ఆయన అదే తరహా పాత్రను బన్నీ సినిమాలోనూ ఇచ్చాడట. ఈ పాత్ర కూడా తనకి మరింత పేరు తెస్తుందనే ఆశాభావంతో అనసూయ ఉందని అంటున్నారు.