రజనీ వసూళ్లకు గండికొట్టిన ధనుశ్
- ఈ నెల 9న విడుదలైన 'దర్బార్'
- 15న రంగంలోకి దిగిన 'పట్టాస్'
- 'దర్బార్' వసూళ్లపై 'పట్టాస్' ప్రభావం
ఈ నెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, వసూళ్లపరంగా తమిళనాట దుమ్మురేపేస్తోంది. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ధనుశ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో, 'దర్బార్' వసూళ్లకు గండిపడిందనే టాక్ వినిపిస్తోంది. ఈ వీకెండ్ లో ఈ ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథాకథనాలు .. ధనుశ్ ద్విపాత్రాభినయం ఆకట్టుకోవడం వల్లనే అక్కడ ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోందనే అభిప్రాయాలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.