ముంబైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... ముగ్గురు మహిళా ఆర్టిస్టులను కాపాడిన పోలీసులు!
- టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారంలో ప్రియా శర్మ
- మహిళా ఆర్టిస్టులతో గుట్టుగా వ్యభిచారం నిర్వహణ
- దాడులు చేసిన ముంబై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు
ప్రియా శర్మను ట్రాప్ చేసిన పోలీసులు, ఆమె, ముగ్గురు ఆర్టిస్టులతో హోటల్ లో ఉన్న సమయంలో దాడులు జరిపారు. ఓ టీవీ చానెల్ క్రైమ్ షోలో యాంకర్ గా ఉన్న యువతి, ఓ వెబ్ సీరీస్ లో నటించిన మైనర్ బాలిక, మరాఠీ చిత్రాలు, సీరియల్స్ లో రాణిస్తున్న ప్రముఖ నటిని ప్రియా శర్మతో ఉండటాన్ని చూసి, వారిని రెస్క్యూ హోమ్ కు తరలించారు. ప్రియా శర్మను రిమాండ్ కు పంపినట్టు తెలిపారు. కాగా, ముంబయిలో ఇదే తరహా సెక్స్ రాకెట్ నడిపిస్తున్న బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ ఒకరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.