ఫైట్ తోనే పవన్ ఎంట్రీ ఇస్తాడట!
- తెలుగులోకి 'పింక్' రీమేక్
- ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్
- కథలో మార్పులు చేసిన వేణు శ్రీరామ్
ముఖ్యంగా పవన్ కల్యాణ్ తదితరులపై ఫైట్ సీన్ తో మొదటి షెడ్యూల్ ను ఆరంభించనున్నారు. సినిమాలో ఈ ఫైట్ సీన్ తోనే పవన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ యాక్షన్ సీన్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలోనూ ఆయన మార్పులు చేశాడని అంటున్నారు. హిందీ .. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కథ, తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.