'అదిరింది' కోసం నాగబాబు అలా ప్లాన్ చేశాడట
న్యాయనిర్ణేత స్థానంలో నాగబాబు .. వేదికపై 'జబర్దస్త్' నుంచి వచ్చిన కమెడియన్లు ఉండటంతో, 'అదిరింది'లో కొత్తదనం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దాంతో కొత్తదనం కోసం కొత్త టీమ్ లను రంగంలోకి దింపాలని భావించిన నాగబాబు, 'పటాస్'తో క్రేజ్ తెచ్చుకున్న 'సద్దాం'ను .. యాదమ్మరాజును తీసుకోమని నిర్వాహకులకు సూచించాడట. ఫలితంగా ఈ ఆదివారం నుంచి వాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బయటికి వచ్చేసింది. మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.