కొరటాల మూవీ కోసం 40 రోజులు కేటాయించిన చరణ్
- కొరటాలతో చిరూ మూవీ
- ప్రత్యేక పాత్రలో చరణ్
- త్వరలోనే సెట్స్ పైకి
కథా పరంగా చిరంజీవి యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం చరణ్ 40 రోజులను కేటాయించినట్టుగా చెబుతున్నారు. తెరపై ఆ పాత్ర నిడివి ఎంతవరకూ ఉంటుందో తెలియదుగానీ, కొరటాల ఏదో పెద్ద ప్రయోగమే చేయనున్నాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో బిజీగా వున్న చరణ్, ఆ తరువాత కొరటాల సెట్స్ పైకి వస్తాడని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.