అల్లు అర్జున్‌కి గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ.. ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేసి బన్నీ హర్షం
- బన్నీకి బట్టలు పంపిన విజయ్ దేవరకొండ
- చెప్పినట్టుగానే బట్టలు పంపాడని బన్నీ ట్వీట్
- ఈ బట్టలు వేసుకునే అల వైకుంఠపురంలో సెలబ్రేషన్‌కి వస్తానని వ్యాఖ్య
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో బన్నీతో త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.