నేను అన్ని రకాల పాత్రలు చేయకుండా ఉండాల్సింది: నటుడు శివారెడ్డి
- నాకు మిమిక్రీ అంటేనే ఇష్టం
- ఏదో ఒక రూట్లో వెళితే బాగుండేది
- మిమిక్రీ మానేయకపోవడం కూడా కారణమేనన్న శివారెడ్డి
శివారెడ్డి ఫలానా పాత్రలు మాత్రమే బాగా చేయగలడు అని అనుకోకూడదనే ఉద్దేశంతో, అన్ని రకాల పాత్రలు చేశాను. అయితే అలా చేయడం నేను చేసిన తప్పు అనే విషయం ఆ తరువాత అర్థమైంది. ఒక తరహా పాత్రలు చేస్తూ పేరు తెచ్చుకుంటే, ఆ తరహా పాత్రల కోసం పిలిచేవారు. అన్ని రకాల పాత్రలు చేయడం వలన, నన్ను ఏ తరహా పాత్రలకి పిలవాలనే విషయంలో అయోమయానికి అవతలివారు లోనయ్యారని అనుకుంటున్నాను. నేను మిమిక్రీ మానేయకపోవడం కూడా సినిమాల్లో అవకాశాలు తగ్గడానికి మరో కారణమనే విషయం కూడా నాకు అనుభవంలోకి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.