'జాను' సినిమా నుంచి శర్వానంద్ ఫస్టులుక్
- వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచిన '96'
- తెలుగు రీమేక్ గా రూపొందుతున్న 'జాను'
- సంగీత దర్శకుడిగా గోవింద్ వసంత
తమిళంలో 2018 చివర్లో వచ్చిన '96' సినిమాకి ఇది రీమేక్. తమిళ సినిమాను రూపొందించిన ప్రేమ్ కుమార్ తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సినిమాకి సంగీతాన్ని అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకి కూడా బాణీలు కట్టాడు. తమిళంలో త్రిష - విజయ్ సేతుపతి జంటగా నటించిన '96' వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి పేరు సంపాదించుకుంది. రీమేక్ గా దిల్ రాజు నిర్మిస్తున్న 'జాను' ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.