ఆ కో డైరెక్టర్ తిట్టిన తిట్టు నాకు గునపంలా గుచ్చుకుంది: నటుడు సత్యప్రకాశ్
- నాకు ఆ టిఫిన్ సరిపోలేదు
- సెట్లో నుంచి బయటికి పంపించేశారు
- ఆ కో డైరెక్టర్ కి గట్టిగానే చెప్పానన్న సత్యప్రకాశ్
ఆ రోజున ఫైట్ సీన్ సరిగ్గా చేయలేకపోయాను. దాంతో నన్ను బయటికి పంపించేశారు. నా వెనుకే బయటికి వచ్చేసిన కో డైరెక్టర్ నన్ను ఒక తిట్టు తిట్టాడు. అది నన్ను గునపంలా గుచ్చుకుంది. అప్పుడు నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఆ తరువాత కొంత కాలానికి నేను నటుడిగా ఎదిగాను .. ఆ కో డైరెక్టర్ మాత్రం అలాగే వున్నాడు. ఒకసారి నాకు డైలాగ్ చెప్పడానికి నా దగ్గరికి వచ్చాడు. గతంలో నన్ను తిట్టిన విషయాన్ని ఆ కో డైరెక్టర్ కి గుర్తుచేశాను. ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వచ్చే వాళ్లను అలా అవమానించవద్దని గట్టిగానే చెప్పాను" అని అన్నారు.