విఘ్నేశ్ శివన్ ప్రేమలో సంతోషంగా వున్నాను: నయనతార
- అభిమానులకు ధన్యవాదాలు
- విఘ్నేశ్ శివన్ సహకారం మరువలేనిది
- పుకార్లకు చెక్ పెట్టిన నయనతార
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకి అవార్డులు దక్కడానికి కారణమైన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన కలలను నిజం చేసుకోవడంలో విఘ్నేశ్ శివన్ సహకారం ఎంతో ఉందని అన్నారు. విఘ్నేశ్ శివన్ ప్రేమలో తాను చాలా సంతోషంగా ఉన్నాననీ, ఆయన ప్రేమలో తాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు. ఇటీవల విఘ్నేశ్ శివన్ .. నయనతార విడిపోయినట్టుగా వార్తలు షికారు చేశాయి. నయనతార మాటలు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాయి.