చిరంజీవి పాట హమ్ చేస్తూ వేదికపై రౌడీ అల్లుడు స్టెప్పేసిన అనిల్ రావిపూడి
- హైదరాబాదులో సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
- చీఫ్ గెస్ట్ గా చిరంజీవి
- చిరంజీవే తనకు స్ఫూర్తి అని తెలిపిన అనిల్ రావిపూడి
ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అబ్బ నీ తియ్యనీ దెబ్బ పాటకు డ్యాన్స్ చేస్తే ఓ జామెట్రీ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారని, ఆ తర్వాత లవ్ మీ మై హీరో అనే పాటకు డ్యాన్స్ చేస్తే ఓ సబ్బు పెట్టె బహుమతిగా ఇచ్చారని వెల్లడించాడు. లవ్ మీ హీరో పాటలో దివ్యభారతి గారిని చిరంజీవి తన కాలిపై కూర్చోబెట్టుకుని వేసే స్టెప్పు తనకెంతో ఇష్టమని చెప్పడమే కాదు, ఆ పాటను హమ్ చేస్తూ ఓ స్టెప్పేసి చూపించాడు. అది చూసి చిరంజీవి చప్పట్లతో అభినందించారు.