బాలకృష్ణ సినిమాకి నో చెప్పిన తమన్నా?
- బోయపాటితో బాలకృష్ణ
- తమన్నాతో సంప్రదింపులు
- ఫిల్మ్ నగర్లో ఇదే హాట్ టాపిక్
బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం తమన్నాను అడిగారట. అయితే ఈ ఆఫర్ ను తమన్నా సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ సినిమాకి నో చెప్పేంత బిజీగా అయితే తమన్నా లేదు. మరి అలాంటప్పుడు ఆమె నో చెప్పడానికి కారణం ఏమైవుంటుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.