హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం... 'మా' ఉపాధ్యక్ష పదవికి రాజీనామా!
- 'మా' డైరీ ఆవిష్కరణలో రభస
- రాజశేఖర్ విమర్శలు
- భగ్గుమన్న చిరంజీవి, మోహన్ బాబు
అంతకుముందు హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ తీవ్ర ఆగ్రహావేశాలతో ప్రసంగించారు. వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్ బాబులు సైతం ఆగ్రహానికి గురయ్యేలా రాజశేఖర్ ప్రసంగం సాగింది. ఈ వివాద ఫలితంగానే రాజశేఖర్ 'మా' పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేసిన కాసేపటికే రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.