'మత్తు వదలరా' ఖర్చు కేవలం 2 కోట్లు మాత్రమేనట
- శ్రీ సింహ హీరోగా రూపొందిన 'మత్తు వదలరా'
- దర్శకుడిగా రితేశ్ రాణా
- 42 రోజుల్లో షూటింగు పూర్తి
ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తాము ఖర్చు చేసిన మొత్తం 2 కోట్లు మాత్రమేనని చెప్పారు. నటీనటుల పారితోషికాన్ని మినహాయిస్తే, మేకింగ్ కోసం ఖర్చు చేసిన మొత్తం 1.3 కోట్లు మాత్రమేనని అన్నారు. ఎక్కడికక్కడ ఖర్చును తగ్గిస్తూ .. ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా దర్శకుడు చూసుకున్నాడనీ, 42 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేశాడంటూ వాళ్లు ఆయనను అభినందించారు.